నారద వర్తమాన సమాచారం
మోసగాడు అంబటి వేళాంగిణి రాజు లీలలు.
ఉద్యోగాల పేరుతో సుమారు 2 కోట్ల కు టోకరా..
ఎయిమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 12 లక్షలకు టోపీ.
మంగళగిరి రూరల్ పోలీసులను అశ్రయించిన బాధితులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు.
వేళాంగిణి రాజుపై నేటికి 6 చీటింగ్ కేసులు.
వెలుగులోకి రాని మోసాలు ఎన్నో ?
నిరుద్యోగుల అశలను అవకాశంగా మలుచుకుని, ప్రభుత్వ కార్యాలయాలో ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ అమాయకుల వద్ద భారీ ఎత్తున్న డబ్బులు తీసుకుని నమ్మించి మోసగించటమే పనిగా పెట్టుకున్నాడు.ఓ మోసగాడు.మాటల గారడీతో 2017 నుండి ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ బారీగా డబ్బులు తీసుకుని నిరుద్యోగులను మోసగించటం పరిపాటిగా మారింది. మోసగాడిపై ఇప్పటికే 6 చీటింగ్ కేసులు నమోదు కాగా, సుమారు రెండు కోట్ల రూపాయలు మేర బాధితులు ఆర్దికంగా మోసపోయారు.
మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన అంబటి వేళాంగిణి రాజు మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు పేరుతో మోసాలకు పాల్పడుతున్న వరుసగా కేసులు నమోదు అవుతున్న అతని మోసాలకు మాత్రం అమాయకంగా బాధితులు బలి అవుతునే ఉన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ ఉద్యోగాలు ఇప్సిస్తానని మాయ మాటలు చెప్పి మంగళగిరి, తాడేపల్లికి చెందిన 6గురి వద్ద 12 లక్షల రూపాయలు తీసుకుని ముఖ్యమంత్రి కార్యాలయ సిపార్స్ లేఖలు, ఎయిమ్స్ లో ఉద్యోగం పేరుతో అపాయింట్మెంట్ నకీలీ పత్రాలను సృష్టించి బాధితులకు వేళాంగిణి రాజు ఇచ్చాడు. అతని వలన మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబో మంటూ మంగళగిరి రూరల్ పోలీసులను అశ్రయించారు.
ఆగని వేళాంగిణి రాజు మోసాలు….
2017నుండి వేళాంగిణి రాజు మోసాల పరంపరా నేటికి కోనసాగుతునే ఉంది.2017లో పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన అతని బంధవులకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని 72 లక్షలకు టోకరా వేశాడు. అచార్య నాగార్జున యూనివర్శటీలో ఉద్యోగం ఇప్పిస్తానని నిడమర్రు గ్రామానికి చెందిన మహిళ వద్ద 12 లక్షల రూపాయలు తీసుకుని మోసగించాడు.యర్రబాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడిని మోసగించి 25 లక్షలకు టోపి పెట్టాడు.
ట్రాప్ చేసి ఇద్దరూ కానిస్టేబులను ఇరికించాడు.
మోసగాడైన వేళాంగిణి రాజు గతంలో మంగళగిరి రూరల్ స్టేషన్ కు చెందిన ఇద్దరూ కానిస్టేబుళ్లను ట్రాఫ్ చేసి ఇరికించడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.చీటింగ్ కేసులలో మంగళగిరి కోర్టుకు వస్తూ,రూరల్ కోర్టు కానిస్టేబుల్ తో నమ్మికగా ఉంటూ అన్న లాయర్ కు డబ్బులు నీవు ఇవ్వు,నేను నీకు ఫోన్ పే చేస్తాను అని చెప్పి పలుమార్లు లాయర్ ఫీజులు కానిస్టేబుల్ ద్వార అందింపచేసేవాడు. కానిస్టేబుల్ కు వేళాంగిణి రాజు ఫోన్ పే చేసేవాడు.. వేళాంగిణి రాజు మాటలు నమ్మిన కోర్టు కానిస్టేబుల్ లాయర్ కు తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తూ ఉండేవాడు. వేళాంగిణి రాజు ఫోన్ పే నుండి కానిస్టేబుల్ కు డబ్బులు పంపేవాడు.ఆదే విధంగా రూరల్ సర్కిల్ కార్యాలయంలో పని చేసే కానిస్టేబుల్ తో సన్నిహితంగా ఉంటూ ఫోన్ పే కు డబ్బులు కోట్టేవాడు.వేళాంగిణి రాజు పై ఉన్న విశాఖపట్నం చీటింగ్ కేసు వారెంట్ విషయంలో కానిస్టేబుల్ ఇరువురు సహకరించలేదని వేళాంగిణి రాజు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుళ్లకు ఫోన్ పే ద్వార పంపిన ఆధారాలను చూపటంతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు అప్పట్లో ఆదేశించారు. వేళాంగిణి రాజు నమ్మించి మోసం చేశాడని బాధిత కానిస్టేబుళ్లు అప్పట్లో లబోదిబో మన్నారు.
అంబటి వేళాంగిణి రాజు పై ఇప్పటికే 6 చీటింగ్ కేసులు నమోదు కాగా,వెలుగులోకి రాని మోసాలు ఎన్నో ?
వేళాంగిణి రాజు మోసాలపై ప్రత్యేక దృష్టిసారించిన రూరల్ పోలీసులు
మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వేళాంగిణి రాజు మోసాలపై ప్రత్యేక దృష్టి సారించారు.మంగళగిరి రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు దిశగా అడుగులు వేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.