నారద వర్తమాన సమాచారం
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము . ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలను ఆర్ధికముగా ఆదుకొని, వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు ఏటి అగ్రహారం శ్రీరామ్ నగర్ లో ఉన్న సచివాలయ బిల్డింగ్ లో ఆంధ్రప్రదేశ్ వెనుక బడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల కేంద్రాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. . ఈ సందర్భముగా శిక్షణ కేంద్రానికి వచ్చిన మహిళలతో ఎమ్మెల్యే ముచ్చటించి, వారి కుటుంబ ఆర్ధిక స్థితిగతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీయే కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని, మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దేశంలోనే తొలిసారి డ్వాక్రా సంఘాలు స్థాపించి, మహిళలకు చంద్రబాబు నాయుడు చేయూతనందించారన








