నారద వర్తమాన సమాచారం
విధులలో ప్రతిభ కనపరిచిఅవార్డుఅందుకున్న గురజాల రెవెన్యూ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్.
మాచర్ల విద్యుత్ శాఖ పరిధి రెంటచింతల సెక్షన్ బిల్లింగ్, విధుల నిర్వహణ, అధికారులతో మంచి ప్రవర్తన తో పాటు అందుబాటులో ఉంటూ అధికారులకు సమాచారం అందిస్తూ ప్రతిభ కనబరిచిన జొన్నల అనిల్ కుమార్ రెడ్డి( జూనియర్ అసిస్టెంట్), విధుల నిర్వహణ, అధికారులతో మంచి ప్రవర్తన, అధికారులకు సమాచారం అందిస్తూ ప్రతిభ కనపరిచాడు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రశంసా పత్రం ను అందుకున్నారు. ఈ మేరకు ఈఈ ఎన్. సింగయ్య, దాచేపల్లి డి ఈఈ తుమ్మల వీరేశ్వరరావు, పిడుగురాళ్ల ఏ ఏ ఓ పి. సందీప్ కుమార్, మాచర్ల ఈఆర్ఓ కార్యాలయం ఏ ఏ ఓ గిరి ముని చంద్రశేఖర్ లు అభినందనలు తెలిపారు.








