వేములపల్లి లో అంబేద్కర్ వర్ధంతి
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి: ఏబిఆర్ యూత్ వేములపల్లి అధ్యక్షుడు: పుట్టల మధు
వేములపల్లి
నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి :శంకర్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేములపల్లి లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు పుట్టల మధు మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని వేములపల్లి జెడ్పిహెచ్ ప్రభుత్వ పాఠశాలలో, మోడల్ స్కూల్లో అంబేద్కర్ జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీ నిర్వహించామని తెలిపారు. అందులో ప్రధమ ద్వితీయ బహుమతులు అందజేశారు. పార్టిసిపెండ్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా బహుమతులు ప్రధానం చేశారు. అంబేద్కర్ సేవలు మరవరాని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దీన సుజాత, జడ్.పి.హెచ్.ఎస్ వేములపల్లి ఉపాధ్యాయులు, అంబేద్కర్ యూత్ కమిటీ ఉపాధ్యక్షులు వంటపాక వంశీ, గుడుగుంట్ల కిరణ్, ప్రధాన కార్యదర్శి రమణపల్లి సంజయ్, సహాయ కార్యదర్శులు దైవ సంజయ్, కోశాధికారి మాతంగి రీగన్,తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








