నారద వర్తమాన సమాచారం
దుర్గి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలలో నూతన ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలలో ఐదవ తరగతి మరియు ఇంటర్ లో నూతన ప్రవేశాలు కోసం దరఖాస్తులను కార్డ్స్ బాలబాట ద్వారా చేయిస్తున్నట్లు కార్డ్స్ బాలబాట దుర్గి మండల (ఏరియా కోఆర్డినేటర్) ఏసిఓ
కుక్కమూడి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం దుర్గిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని అంబేద్కర్ గురుకులాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గురుకులాలలో నూతన ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందని దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 19 ఆఖరి తేదీ అని మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామీణ నిరుపేదపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు తమను సంప్రదించాలని కోరారు అలాగే
6 వ తరగతి నుండి
10 వ తరగతి వరకు ఉన్న ఖాళీలలో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రకటనను తెలిపిన వారిలో కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ ఉన్నారు
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు జమ్మలమడక టిడిపి మాజీ ఎంపీటీసీ మెంబర్ పరిమళ్ళ రాజారావు పాల్గొన్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్
6304175424,8121407397
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







