Tuesday, March 24, 2026
spot_img

పట్లవీడు-ముటుకూరు ఆర్టీసీ   బస్సు ఎస్సీ కాలనీ చివరన ఉన్న బస్ స్టాప్ వరకు నడపాలని, మాచర్ల తహసి ల్దార్ కి వినతి పత్రం అందించిన ప్రజాసంఘాలు

నారద వర్తమాన సమాచారం

పట్లవీడు-ముటుకూరు ఆర్టీసీ   బస్సు ఎస్సీ కాలనీ చివరన ఉన్న బస్ స్టాప్ వరకు నడపాలని,


మాచర్ల బస్టాండ్ లోపల ఎమ్మార్పీ కంటే అధిక రేట్లు అమ్ముతున్న వ్యాపారస్తులపై మరియు సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్న ఆర్టీసీ డిఎం వీరస్వామి పై చర్యలు తీసుకోవాలని

డిప్యూటీ తహశీల్దార్ కు— కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి

మండాది,పట్లవీడు ఎర్రబాలెం మీదుగా ముటుకూరు వెళ్తున్న పట్లవీడు–ముటుకూరు సర్వీస్ గల బస్సు ముటుకూరులోని ఎస్సీ కాలనీ చివర ఉన్న బస్ స్టాప్ వరకు నడపాలని, ఆర్టీసీ మాచర్ల బస్టాండ్ లోపల వ్యాపారాలు నిర్వహిస్తూ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ మరియు తినుబండారాలు ఎమ్మార్పీ ధర కంటే అధిక రేట్లకు అమ్ముతున్న వ్యాపార సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించమని అర్జీ ఇచ్చిన సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్న ఆర్టీసీ డిఎం వీరస్వామి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మాచర్ల తహశీల్దార్ కార్యాలయం నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ వాణికి పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో
దళిత ప్రజా సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈసందర్భంగా
ప్రసాద్ మాట్లాడుతూ పట్లవీడు–ముటుకూరు సర్వీస్ గల బస్సు ముటుకూరులోని బ్రహ్మంగారిగుడి దగ్గరే ఆగి త్రిప్పుకొని మరల ప్రయాణికులతో మాచర్లకు వస్తుందని, బ్రహ్మంగారి గుడి వద్ద నుండి ఎస్సీ కాలనీ సుమారు అర కిలోమీటర్ దూరం ఉంటుందని ఎస్సీ కాలనీ లోని ప్రజలు ప్రయాణికులు, వృద్ధులు గర్భిణీలు విద్యార్థులు ఆశా వర్కర్లు ఈ కాలనీ నుండి ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తూ ఉంటారని, కాలినడకన నడుసుకుంట వచ్చేసరికి బస్సు వెళ్లిపోవడం జరుగుతుందని, దీనివల్ల కాలనీలోని ప్రజలు ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారని, చేరవలసిన గమ్యస్థానానికి సకాలంలో చేరుకోలేకపోతున్నారనిఈ విషయాన్ని గుర్తించిన మేము ఎస్సీ కాలనీ చివరన ఉన్న బస్టాఫ్ వరకు
పట్లవీడు-ముటుకూరు సర్వీస్ గల బస్సును నడపాలని
2026 ఫిబ్రవరి 9న మాచర్ల ఆర్టీసీ డిఎం వీరస్వాకి అర్జీ ఇవ్వడం జరిగిందని
అలాగే బస్టాండ్ లో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల వద్ద నుండి బస్టాండ్ లోపల వ్యాపారస్తులు డబ్బులు దండుకుంటున్నారని, సమస్యలను పరిష్కరించాలని ఇచ్చినటువంటి అర్జీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని డిఎం వీరస్వామిని కలవగా వారు ఎస్సీ కాలనీ చివరకు బస్సు నడపలేమని మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదని బస్సు రావడానికి, త్రిప్పుకొనుటకు అక్కడ అనుకూలంగా ఉన్న అక్కడ వరకు బస్సు రాదని పొంతన లేని సమాధానం చెబుతూ కాలయాపన చేస్తూ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరించకపోగా ముటుకూరు ఎస్సీ కాలనీ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని
ఆర్టీసీ డిఎం వీరస్వామి పై చర్యలు తీసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన కోరారు.
ఈ విషయంపై డిప్యూటీ తహాశీల్దార్ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
ఆమెకు ప్రసాదు
తోపాటు ప్రజాసంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

వినతి పత్రం అందజేసిన వారిలో దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి,
ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు బీసీ నవ చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading