నారద వర్తమాన సమాచారం
భద్రాద్రి రాములోరి గోత్రంపై వివాదం.. నేడు హైకోర్టులో విచారణ
భద్రాద్రి రామయ్య గోత్రంపై నెలకొన్న వివాదం హైకోర్టుకు చేరింది. గతంలో స్వామినివశిష్ట గోత్రికుడిగా, సీతమ్మను గౌతమస గోత్రంగా పూజించేవారు. 2012 తర్వాత పండితులు స్వామిని ‘అచ్యుత’, అమ్మవారిని ‘సౌభాగ్య’ గోత్రాలుగా చదువుతున్నారని 2022లో ఓ భక్తుడు కోర్టుకెక్కారు. దీనిపై కోర్టు వేసిన కమిటీ దేవాదాయ శాఖకు నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టును బయటపెట్టకపోవడంతో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నిత వివాదంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









