నారద వర్తమాన సమాచారం
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంబించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
పేదల ఇళ్లల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “పీఎం సూర్య ఘర్:” పథకాన్ని సోమవారం స్థానిక శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ లాంఛనంగా ప్రారంభించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ 1200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా వారి ఇంటి పైనే ఏర్పాటు చేసి అక్కడే విద్యుత్ ఉత్పత్తి అయ్యేవిధంగా చర్య తీసుకుంటున్నామన్నారు. దీని ద్వారా వారికి విద్యుత్తు లభించడంతోపాటు భవిష్యత్తులో దాన్ని అమ్ముకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు.
అదేవిధంగా బీసీలు, ఓసీలకు సైతం సబ్సిడీపై ఈ పథకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ పథకం కింద కోటి మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయన్నారు. లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులుగా చేర్చి వారికి విడతల వారీగా సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గం లోని ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని సూచించారు.
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్యుత్ అందించడం. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా లభిస్తుంది.
విద్యుత్ కోతలు, భారీ బిల్లుల నుంచి ఎస్సీ, ఎస్టీ సోదరులకు శాశ్వత విముక్తి కల్పించడమే లక్ష్యం” అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న విద్యుత్ శాఖ అధికారులు లబ్ధిదారులుమరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








