నారద వర్తమాన సమాచారం
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహ పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన మఠాధిపతి శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి
జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చారిత్రక నివాస గృహ పునర్నిర్మాణ పనులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారు శుక్రవారం శుభముహూర్తంలో భూమిపూజ నిర్వహించారు.
ఈ నెల 16వ తేదీన ఇంటాక్ (INTACH) సంస్థ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో, శుభదినమైన శుక్రవారం మఠాధిపతి స్వయంగా నివాస గృహం వద్ద టెంకాయ కొట్టి, వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రార్థించారు.
అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహానికి ఆనుకుని ఉన్న పురాతన శ్రీ సీతారామాలయాన్ని దర్శించుకుని, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మఠాధిపతి సోదరుడు శ్రీ దత్తాత్రేయ స్వామి, ప్రధాన అర్చకులు బ్రహ్మయ్య స్వామి, బేస్తవారిపేట అర్చకులు కేశవ, కందిమల్లయ్య పుర గ్రామ ప్రజలు ,మఠ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








