నారద వర్తమాన సమాచారం
న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేయండి: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
జిల్లాలో పెద్ద ఎత్తున న్యూట్రి గార్డెన్ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక & సామూహిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో న్యూట్రి గార్డెన్ లు అభివృద్ధి చేయాలన్నారు. ఈ నెలాఖరు నాటికి న్యూట్రి గార్డెన్ ల కోసం నేల తయారీ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల మొదటి బుధవారం జిల్లా వ్యాప్తంగా న్యూట్రి గార్డెన్ లను ప్రారంభించాలన్నారు. అదే రోజు స్వయం సేవా సంఘాల మహిళలతో కిచెన్ గార్డెన్లు, పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల కోసం విత్తన పంపిణీ చేపట్టాలన్నారు. మండలానికి ఒకటి చొప్పున కమ్యూనిటీ న్యూట్రీ గార్డెన్ లను అభివృద్ధి చేయాలన్నారు.
న్యూట్రీ గార్డెన్ లను లాభసాటి వ్యాపారంలా మలుచుకునేలా స్వయం సేవా సంఘాల మహిళలకు, కమ్యూనిటీ గార్డెన్ నిర్వాహకులకు శిక్షణ అందించాలన్నారు. అదే విధంగా కలెక్టరేట్ లో ప్రయోగాత్మకంగా న్యూట్రీ గార్డెన్ ను అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధవి, అమల కుమారి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, డీఎంహెచ్వో రవి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








