నారద వర్తమాన సమాచారం
మాచర్ల పట్టణంలో అర్బన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కత్తి స్వర్ణలత….
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి కొత్త అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు.
నర్సరావుపేట ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత బదిలీపై మాచర్లకు రాగా, ఆదివారం ఆమె అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక పోలీసు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.
ఇప్పటి వరకు మాచర్ల అర్బన్ ఎస్సైగా సేవలందించిన రమేష్ బదిలీపై వెళ్లడంతో, ఆయన స్థానంలో స్వర్ణలత నియమితులయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్వర్ణలత ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
మాచర్ల పట్టణంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








