Friday, June 19, 2026
spot_img

ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గురజాల అప్పారావు..

నారద వర్తమాన సమాచారం

ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన గురజాల అప్పారావు

కళాశాల పేరు,ప్రఖ్యాతులను కాపాడాలంటూ వినతి

సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలంటూ ఫిర్యాదు దాఖలు

పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీలో ఫిబ్రవరి 9వ తేదీన విద్యార్థుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ పై క్షేత్రస్థాయి విచారణ జరిపి ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీ, ఏటీపీ, పీడీ, ఇతర అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు సోమవారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎంతో పేరు,ప్రఖ్యాతలున్న ఏపీఆర్జేసీ కళాశాలలో గత ఫిబ్రవరి నెల 9వ తారీఖున సినీ ఫక్కిలో సైన్సు, ఆర్ట్స్ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరగడం శోచనీయం అన్నారు. కళాశాల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రాడ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకోవడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్ర గాయం కాగా మరి కొంతమంది విద్యార్థులకు తీవ్ర రక్త గాయాలు అవడం హేయమైన చర్య అన్నారు. ఈ ఘటన వల్ల ఈ సంవత్సరం కళాశాలకు అత్యంత దారుణంగా ప్రథమ సంవత్సర ఫలితాలు వచ్చాయన్నారు.ఈ ఘటనపై ఆ శాఖ ఉన్నతాధికారులు కళాశాలలో తూతూ మంత్రంగా విచారణ చేశారని ఆరోపించారు. కళాశాలలో ఇలాంటి దుర్ఘటన జరిగేందుకు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీ, ఏటీపీ జయప్రకాష్, పీడీ ఫ్రాంక్లిన్, ఇతర అధ్యాపకులు పై ఇప్పటివరకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి శాఖా పరమైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఎంతో పేరు,ప్రఖ్యాతలు ఉన్న కళాశాలలో ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీ నిర్లక్ష్య వైఖరి, బాధ్యతరాహిత్యం వల్ల ఇలాంటి దాడులు విద్యార్థుల మధ్య జరిగాయని ఆయన ఆరోపించారు. తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్ కళాశాలలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్య వైఖరి, బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీ, ఏటీపీ, పీడీ, ఇతర అధ్యాపకులపై తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading