Friday, May 1, 2026
spot_img

పదవి విరమణ పొందిన డీజీపీ బత్తుల శశిధర్ రెడ్డి!

నారద వర్తమాన సమాచారం

పదవి విరమణ పొందిన డీజీపీ బత్తుల శశిధర్ రెడ్డి!

రాష్ట్ర భద్రత సలహాదారుగా శశిధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు!


తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజీపిగా సీని యర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, మే 1న బాధ్యతలు చేపట్టను న్నారు. ఈ సందర్భం గా ఆయన ఈరోజు పదవి విరమణ పొందుతున్న పోలీస్ అధికారి శశిధర్ రెడ్డి, సేవలను కొనియాడు తూ.. పోలీస్ శాఖ భవిష్యత్తు కార్యచరణ పై తన దిశ నిర్దేశాన్ని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దీర్ఘకాలం సేవ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్‌లో గౌరవ వీడ్కో లు పరేడ్ నిర్వహించా రు. ఏప్రిల్ 30, 2026 న జరిగిన ఈ కార్యక్ర మంలో రాష్ట్ర నూతన డీజీపీ సి.వి. ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభి లాష్ బిష్టా, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 32 ఏళ్ల పోలీస్ సేవా జీవితంలో అనేక సవాళ్లు, ఆనందాలు, అనుభవాలు, జ్ఞాపకా లతో ప్రయాణం చేశా నని శివధర్ రెడ్డి తన వీడ్కోలు ప్రసంగంలో తెలిపారు.నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

1970-80లలో ఉన్న పోలీసింగ్ పరిస్థితుల తో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయ ని, ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించా రు.తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసు లపై తెలంగాణ భావా న్ని అణచివేశారు అనే అపవాదు ఉందని, ఆ దూరాన్ని తగ్గించి ప్రజలు-పోలీసుల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడానికి సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని చెప్పారు

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ విధానాన్ని నడిపిం చామని, భవిష్యత్తుకు సిద్ధమైన ఫ్యూచర్ రెడీ,పోలీస్ శాఖను తయారు చేశామని తెలిపారు. తన స్వరాష్ట్రానికి డీజీపీగా నియమించిన ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలన నిర్ణయాలు తీసుకుంది, రాష్ట్ర డిజిపిగా సేవలు పూర్తి చేసుకుని పదవి విర మణ పొందిన సీనియ ర్ ఐపీఎస్ అధికారి బత్తుల శశిధర్ రెడ్డి,ని రాష్ట్ర భద్రత సలహాదా రుగా నియమిస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది, అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత వి హను మంతరావు, ను బీసీ సంక్షేమం, అభివృద్ధి విభాగాలకు ప్రభుత్వం సలహాదారు లుగా నియమించింది, ఈ రెండు నియమాలు రాష్ట్ర పరిపాలనలో ప్రాధాన్యత సంతరించుకుంది .


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading