నారద వర్తమాన సమాచారం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు 10:30 నిమిషాలకు కేబినెట్ సమావేశం జరగనుంది, ఈ సమా వేశంలో కీలక అజెండా ఉంది.. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్వి న్ టవర్ల నిర్మాణానికి రూ. 12 08.41 కోట్లు వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అలాగే అమరావతి సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మా ణంలో ఫసాడ్, గ్లేజిం గ్, క్లాడింగ్ పనులకు రూ. 2540 కోట్లు వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వనుం ది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివి ల్ స్ట్రక్చర్ పనులకు రూ. 798 కోట్లు ఖర్చు చేయడాని కి కేబినెట్ ఆమోదం తెలపనుం ది. సీఆర్డీఏ ప్రతిపాదన లకు కూడా మంత్రి మండలి మంజూరు ఇవ్వనుంది..
ఎల్పీఎస్ జోన్-11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలి క వసతుల అభివృద్ధికి ఆమోదం ఇవ్వనుంది. రాజధానిలో 220 కేవీ లైన్ల రీరూటింగ్‌కు కూడా అనుమతి ఇవ్వనుంది కేబినెట్.. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరుకు సంబం ధించిన నిబంధనల్లో మార్పులు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మెట్ట భూములకు ఎక రాకు రూ. 40, 000, జరీబు భూములకు రూ. 60,000 చొప్పున కౌలు పెంపు కు అను మతి ఇవ్వనుంది. అలాగే ప్రతి ఏడాది మెట్ట భూములకు రూ. 3,000, జరీబు భూ ములకు రూ. 5,000 చొప్పున పదేళ్ల పాటు పెంచేందుకు కూడా ఆ మోదం తెలపనుంది.
రాజధానిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సీఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమో దం తెలపనుంది.
స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేష నల్ స్కూల్ ఏర్పాటు కోసం వేర్వేరు ప్రాంతా ల్లో 4.23 ఎకరాల భూమిని కేటాయించ నుంది. అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటా యింపుకు అనుమతి ఇవ్వనుంది. డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమో దం తెలపనుంది. ఆ ప్కాబ్‌కు రాయపూడి వద్ద 0.49 ఎకరాల భూమిని కేటాయించ నుంది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్ర బాబు,కు కేబినెట్ అభి నందనలు తెలియజే యనుంది. పలు సంస్థ లకు భూ కేటాయింపు లపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోను న్నారు. అజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్ర బాబు మంత్రులతో తాజా రాజకీయ పరి ణామాలపై చర్చించ నున్నారు. రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూ డా చర్చించే అవకాశం ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








