నారద వర్తమాన సమాచారం
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలి. ఉలవల్లపూడి రాము…
అందరికీ మే డే శుభాకాంక్షలు
పత్రికా ప్రకటన
మొక్కజొన్నరైతు లు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
తేదీ.1.5.2026 శుక్రవారం ఉదయం 11 గంటలకు శావల్యాపురం మండలం శావల్యాపురం కృష్ణాపురం మధ్యలో రైతుల ఆరబోసుకున్న మొక్కజొన్న కళాల్లోకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం వెళ్లి రైతులతో మాట్లాడ గ అక్కడ ఉన్న రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఎదురు చూశాం అని ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడంతో రెండు రోజులుగా వాతావరణం లో మార్పులు రావడంతో రైతులు భయపడి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే 700 రూపాయలకు తక్కువకి అమ్ముకుంటున్నావని మబ్బులు చేసి వర్షాలు పడితే కష్టపడి పండించిన పంట వర్షానికి పాడైపోతుందని అప్పుడు కొనే నాధుడు కూడా ఎవరు ఉండరని రైతులు వాపోయారు
రైతులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి తమ రక్తాన్ని చేపటగా మార్చి పండించిన పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనకపోతే రైతులు ఏమైపోతారని పొగాకులాంటి పంటలు ఎక్స్పోర్ట్ లేదని ఈ ఏడాది పొగాకు సాగు వద్దని ప్రత్యామ్నాయ పంటలు రైతులు వేసుకోవాలని మొక్కజొన్న లాంటి పంటలు సాగు చేయాలని రైతుల్ని ప్రభుత్వం మరియు అధికారులు బాగా ప్రోత్సహించడం వల్ల ఒక్క పల్నాడు జిల్లాలోనే ఒక లక్ష 30 వేల ఎకరాలకు పైగా రైతులు మొక్కజొన్న సాగు చేశారని ప్రభుత్వం ఎమ్మెస్సీ ధర 2400 రూపాయలు ప్రకటించే తప్ప ఒక్క బస్తా కూడా రైతుల వద్ద నుండి కొనుగోలు చేయలేదని దళారీలు ఇదే అదునుగా చూసి రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నను అందిన కాడికి దోచుకుంటున్నారని ప్రభుత్వం వెంటనే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ఇప్పటికే అమ్ముకున్న రైతులకు డిఫరెన్స్ అమౌంట్ ని వారి ఖాతాల్లో జమ చెయ్యాలని లేనిచో ఈనెల 5వ తేదీ లోపు కొనుగోలు చేయకపోతే పల్నాడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మొక్కజొన్న రైతుల తో కలిసి ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది అని.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మొక్కజొన్న రైతులు పాల్గొన్నారు
ఉలవలపూడి రాము
ఆంద్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి
9490017947
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








