నారద వర్తమాన సమాచారం
బంగారం తాకట్టు పేరుతో మోసం.. ఎస్పీకి మహిళ ఫిర్యాదు
“బంగారం అమ్మేశానంటూ బెదిరింపులు.. న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించిన మహిళ.”
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)లో ఫిర్యాదు చేశారు.
తాను ప్రకాష్‌నగర్‌కు చెందిన సాగి భారతి వద్ద బంగారం తాకట్టు పెట్టి నగదు తీసుకున్నానని, అనంతరం మొత్తం డబ్బు తిరిగి చెల్లించి బంగారం తీసుకోవడానికి వెళ్లగా, “నీ బంగారం అమ్మేశాను.. నీకు చేతనైతే చేసుకో” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని ఆరోపించారు.
అంతేకాకుండా, “నాకు రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు తెలుసు. అవసరమైతే కొందరు వ్యక్తులను నీపైకి పంపిస్తాను. నీ పిల్లల కాపురాలు కూడా చెడగొడతాను” అంటూ బెదిరింపులకు పాల్పడిందని లక్ష్మీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, తనకు న్యాయం చేయాలని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆమె కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








