నారద వర్తమాన సమాచారం
కొత్త పార్టీ దిశగా కీలక ప్రకటన చేసిన..!విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ, వైసీపీ నేత వీ. విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పార్టీకి తాను బాల్ థాక్రే తరహాలో మెంటర్‌గా ఉంటానని, సీఎం అభ్యర్థిగా మాత్రం ఉండబోనని విజయసాయిరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన పేరు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
టీడీపీ, వైసీపీని కుటుంబ పార్టీలుగా అభివర్ణిస్తూ ఆయన విమర్శలు చేశారు. రెండు పార్టీలకు అధికారంపై, సంపాదనపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని ఆరోపించారు.
“కమ్మ, రెడ్లే ముఖ్యమంత్రులు కావాలా? ఇతర కులాల్లో సమర్థులు లేరా?” అని ప్రశ్నించారు. తమ పార్టీ ద్వారా సమర్థులైన వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








