స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం..నేతల మధ్య గ్యాప్‌లు ఉండొద్దు.. చంద్రబాబు
నారద వర్తమాన సమాచారం
స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని నేతలకు సూచించారు. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
పార్టీలోని నేతల మధ్య ఎలాంటి గ్యాప్‌లు ఉండకూడదని చంద్రబాబు సూచించారు. నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.
మహిళా రిజర్వేషన్ల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సమర్థవంతమైన మహిళా నేతలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించాలని చెప్పారు.
ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సమీక్షించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








