నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం (సెప్టెంబర్ 17, 2026) విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రోహిత్ కుమార్ చౌదరి IPS ముఖ్య అతిథిగా హాజరై, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. విశ్వకర్మ శిల్పకళ, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్‌తో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ఆద్యుడిగా, నిర్మాణాల రూపకల్పనలో శాస్త్రీయత, సౌందర్యం, సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చిన మహనీయుడిగా గుర్తించబడుతున్నారని తెలిపారు. వారిని “డివైన్ ఇంజనీర్” గా పిలుస్తారని గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన విశ్వకర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పోలీసు విభాగంలో విశేష సేవలందిస్తున్న సాంకేతిక సిబ్బంది, మోటార్ వాహన విభాగం మరియు ఇతర ఉద్యోగులకు ఈ వేడుకలు ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో (R I) గోపి నాథ్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








