నారద వర్తమాన సమాచారం
రెసిడెన్షియల్ విద్యకు కొత్త రూపు.. ఏఐ స్కిల్స్, అంతర్జాతీయ ప్రమాణాలపై ఫోకస్. మంత్రి లోకేష్
విద్యాశాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు.
ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతిభావంతుల తయారీ కేంద్రాలుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు.
విద్యార్థులకు ఏఐ స్కిల్స్ శిక్షణ తప్పనిసరి చేయడంతో పాటు.. పాఠశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
తాడికొండ, కొడిగినహళ్లి ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా ఉన్నాయని.. నిమ్మకూరులో వచ్చే ఏడాది నుంచి ఐఐటీ-జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
1978 నుంచి జారీ చేసిన ఇంటర్ సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు.
ఇంటర్ పరీక్షలు, మూల్యాంకన సిబ్బంది భత్యాలను 25 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








