Thursday, November 26, 2026
spot_img

ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న గురజాల అప్పారావు

నారద వర్తమాన సమాచారం

ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న గురజాల అప్పారావు


ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మొదటగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే నేటి భారత దేశ పౌరులకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయన్నారు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును రాజ్యాంగ దినోత్సవం అంటారని,
ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత గొప్ప లిఖిత రాజ్యాంగమని, దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిందని,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన కృషి ఆయన అందించిన సేవలను కొనియాడారు.
ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, తమ ప్రాథమిక విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి మాట్లాడుతూ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష అంటరానితనాన్ని రూపుమాపటానికి మరియు సమాజంలోనే అందరికీ భారత రాజ్యాంగం ద్వారా సమాన అవకాశాలు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన త
సమానత్వం న్యాయాన్ని అందరికీ సమానంగా అందేలా చూడాలని కోరారు.

ఉషోదయ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సేవా సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు యరసాని జక్రయ్య బీసీ నవ చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్యలు మాట్లాడారు. అందరికీ 77వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు రాయనూతల నాగయ్య, డప్పు కళాకారుల సంఘం సీనియర్ నాయకులు కంభంపాటి దానం, మాచర్ల నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నాయకులు గారే చిన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading