నారద వర్తమాన సమాచారం
దర్శి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారిదేవాలయాన్ని సందర్శించిన ప్రకాశంజిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి
దర్శి.
దర్శిలో గల బంగారం బావి దగ్గర గల శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం చెన్నుపల్లి శ్రీనివాసాచారి దేవాలయాని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ రిజిస్టర్ దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారులకు గౌరవ వేతనంగా 10.000 రు అందిస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణ రెడ్డికి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదములు. ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి లో గల వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో ఉన్న అర్చకుని కూడా ఈ పథకం వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ టిడిపి పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ గారిని కోరుతూ జిల్లా వ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు పనిచేస్తున్న అర్చకులు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జిల్లా సెక్రెటరీ పనిధపు సుధాకర్ జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు చోడ వెంకట సుబ్బారావు. అద్దంకి సంఘ కార్యదర్శి ఏలూరి వీర బ్రహ్మచారి దర్శి సంఘ నాయకులు దొడ్డేటిపల్లి రామేశ్వరాచారి. సోడా చంద్రశేఖర ఆచారి. సంఘ నాయకులు తెనాలి బాల నాగేశ్వరరావు.దేవస్థాన పూజారి వడ్డే గుంట సుబ్బారావు సంఘ సీనియర్ నాయకులు. బ్రహ్మంగారి దేవస్థాన ప్రధాన అర్చకులు తెనాలి రాధాకృష్ణమూర్తి మరియు స్థానిక భక్తులు సంఘ నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.