నారద వర్తమాన సమాచారం
పొలిటికల్ ఎనాలసిస్:
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది కరప్షన్ లేని దేశాన్ని కరప్షన్ లేని రాష్ట్రాలను చూడాలని ఆలోచనతో ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించడం జరిగింది
ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది, ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేయడం జరిగింది
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ప్రజల బ్రహ్మరథం పట్టుతూ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకుంటూ వస్తున్నారు, ఢిల్లీ తో పాటుగా పంజాబ్, హర్యానా ,గోవా, ఉత్తరప్రదేశ్ మొదలగు రాష్ట్రాల్లో పోటీ చేసి పంజాబ్ రాష్ట్రాన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీకి వందల కోట్ల రూపాయల సమకూర్చే దిశలో లిక్కర్ పాలసీలో భాగంగా తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ గారాలపట్టి కవిత ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొంతమంది ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిషి సిసోడియా వీరందరితో కలిసి వందల కోట్ల రూపాయల చేతులు మారాయి అని లిక్కర్ పాలసీలో ఢిల్లీ ప్రభుత్వం వారికి అనుగుణంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేసి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిషి సోడియాని, కవితాని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శరత్ చంద్రారెడ్డిని, మాగుంట శ్రీనివాసరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది
ఇప్పుడేమో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేను రాజీనామా చేస్తున్నాను, నేను అగ్ని పరీక్షకు వెళుతున్నాను (సీతాదేవిని సంబోధిస్తూ మాటల యుద్ధం స్టార్ట్ చేశాడు)నేను తప్పు చేస్తే ఢిల్లీ ప్రజలు నాకు నా పార్టీకి ఓటు వేయవద్దు, నేను తప్పు చేయలేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది
ప్రతిపక్ష పార్టీలకు ముందస్తు సూచనలు చేస్తూ వారి కంటే ముందుగానే, నేను తప్పు చేస్తే నాకు ఓటు వేయవద్దు అనుకుంటూ మీరు నన్ను నమ్మితే నన్ను ఇబ్బంది పెట్టిన పార్టీ బిజెపి ఓడించి మరలా నన్ను గెలిపించవలసిందిగా ప్రజల ముందుకు వస్తున్నాను అనుకుంటూ బిజెపి పార్టీకి సవాల్ విసరటం జరిగింది:
ఇప్పుడు బిజెపి పార్టీ, ప్రజల ముందుకు మేము ఆమ్ ఆద్మీ పార్టీని కానీ, కేజ్రీవాల్ కానీ మేము ఏమి ఇబ్బంది పెట్టలేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని అంటుందా, కేజ్రీవాల్ వందల కోట్ల రూపాయలు స్కాములు చేశాడు కేజ్రీవాల్ మంచి వాడు కాదు అని అంటుందా ఏ విధంగా ఢిల్లీ ప్రజల ముందుకు వెళ్ళబోతుంది అనే చర్చ ఢిల్లీ ప్రజల ముందుకు వస్తున్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు
కేజ్రీవాల్ గెలిస్తేనేమో!! భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టింది గా ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని అనుకుంటారు??
అదే సమయంలో BRS పార్టీకి కూడా( కవిత ) ఇబ్బంది పెట్టినట్లుగా ప్రజలు గుర్తిస్తారు ..
కాబట్టి Bjp ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిస్తే తప్ప బిజెపికి నేషనల్ లెవల్లో ఇబ్బందులు తప్పవు
ఒకవేళ కేజ్రీవాల్ గెలిస్తే , భారతీయ జనతా పార్టీ మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఉవ్వెత్తిన ఎగిసి పడతాయి అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు
ఇట్లు ..
మీ. నవ కుమార్. అంబటి.
(పై తెలుపబడిన అంశాలన్నీ కూడా నా సొంత అభిప్రాయంగా పరిగణించవలసిందిగా కోరుతున్నాను)
Discover more from
Subscribe to get the latest posts sent to your email.