నారద వర్తమాన సమాచారం
వారే వ్వా …! స్మశానానికి కేటగిరి టు విద్యుత్ మీటర్లా
కేటగిరి టు మీటర్లు పొందిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరు ?
ఆ మీటర్లు పేరు ఉన్న వారికే ఆ స్మశాన స్థలం సొంత మౌతుందా?
బెల్లంకొండ:-
పంచాయితీ, విద్యుత్ శాఖ అధికారుల పనితీరు ఇదేనా…
పల్నాడుజిల్లా బెల్లంకొండమండలం స్మశానములో ఆత్మలు, దెయ్యాలు వ్యాపారాలు చేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ అధికారులు కేటగిరి టు విద్యుత్ మీటర్లు మంజూరు చేశారు. స్మశానంలో ఉన్న దయ్యాలు, ఆత్మలు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏసీలు, వారి జీవన విధానంలో అవసరమయ్యే గృహాపకరణ విద్యుత్ పరికరాలకు క్యాటగిరి టు విద్యుత్ మీటర్ల వినియోగిస్తున్నారా అని ప్రజలు విద్యుత్ శాఖ అధికారుల పనితీరును వారేవా అంటూ హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. ఈ మీటర్ల వల్ల స్మశాన వినియోగదారులకు జేబులకు చిల్లులు పెట్టి విద్యుత్ శాఖ అధికారులు డబ్బు వసూలు చేశారని గ్రామ ప్రజల విమర్శించుకుంటున్నారు. స్మశానములో గాజు పూసల తీయుటకు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుంటామని గ్రామపంచాయతీ సమావేశంలో కొందరు అర్జీలు పెట్టగా సర్పంచి, వార్డ్ మెంబర్లు ఆమోదం తెలిపారు. గాజుపూస అవసరాలకు క్యాటగిరీ వన్ , విద్యుత్ మీటర్ సరిపోతుందని కొందరు తెలుపుతున్నారు, స్మశానాలలో దాదాపుగా ఖర్మ కాండల విషయానికొస్తే ఏ కార్యక్రమమైనా పగలే నిర్వహిస్తారు. ఇక్కడ ఎలాంటి వ్యాపార సముదాయాలు నిర్వహించరు. దీనికి భిన్నంగా బెల్లంకొండలో పనిచేస్తున్న కొందరు విద్యుత్ శాఖ అధికారులు 364 సర్వే నెంబర్ గల ఒక స్మశానానికి క్యాటగిరి టు సంబంధించిన నాలుగు విద్యుత్ మీటర్లు అమర్చినట్లు సమాచారం. అమర్చన విద్యుత్ మీటర్ల వల్ల విద్యుత్ శాఖకు డిపాజిట్ల రూపంలో, వినియోగించుకున్న యూనిట్ల రూపంలోనూ అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక సామాన్యుడు విద్యుత్ మీటర్ పొందాలంటే మీ స్థలానికి సంబంధించిన కాగితాలు, పంచాయతీ అధికారులకు కట్టిన ఇంటి పన్ను, స్థలం పన్నుల రసీదులు వంటి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అడిగి కార్యాలయం చుట్టూ తిప్పుకొని ఇబ్బందులకు గురి చేసే విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వ స్థలంలో ఏ అధికారి ధ్రువీకరించి ఇచ్చిన పత్రాలతో, పంచాయితీ పేరుతో నా లేక ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల పేరుతో స్మశానంలో క్యాటగిరి టు విద్యుత్ మీటర్లు నాలుగు అమర్చరనేది ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది. తమ కోరికలు తీరకుండా చనిపోయిన వారు స్మశానాలలో దయ్యాలు, ఆత్మలు రూపంలో రాత్రి సమయాల్లో తిరుగుతాయనేది ప్రజల నమ్మకం. రాత్రి సమయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించని స్మశాన స్థలానికి నాలుగు విద్యుత్ మీటర్లు అవసరమవుతాయా ? లేక చీకటి వ్యాపారాలు చేసుకునేందుకు స్మశాన స్థలాన్ని అనుకూలంగా మార్చుకున్నారా ? సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారా ? అనేది గ్రామ ప్రజల్లో ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పరిశీలించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సందిగ్ధంలో ఉన్న ఆ యా కులాల వారిని మేల్కొల్పాలని ప్రజలు కోరుతున్నారు.
ఆ మీటర్లు ఉన్న వారికే ఆ భూమి సొంతమా…
స్మశాన స్థలం ప్రభత్వ భూమిగానే ఉంటుందని ఎదైన మీటర్లు ఇవ్వాలంటే పంచాయతీ పేరుమీద ఇస్తారు కాని వేరే వారి పేరు మీద ఇవ్వడం ఎలా సాధ్య పడుతుంద నేది చర్చనీయాంశంగా మారింది. ఆ స్మశాన స్థలం లో నాలుగు కేటగిరీ టు మీటర్లు ఆ నలుగురు పేరు మీద విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చి ఉంటే కొన్ని సంవత్సరాల తరువాత ఆ స్మశాన స్థలం వారికే దక్కుతుందా అన్న అనుమాలు రేకేత్తిస్తున్నాయి. పంచాయతీ తీర్మానం తో విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు ఇవ్వటం
చివరికి ఏ దరికి చేరి ఏ అధికారులకు తిప్పలు తెస్తాయో వేచి చూడాల్సిందే మరి..
ఈ విద్యుత్ మీటర్ల విషయమై బెల్లంకొండ విద్యుత్ శాఖ ఏఈ పవన్ కుమార్ వివరణ కోరగా క్యాటగిరి టు సంబంధించిన నాలుగు విద్యుత్ మీటర్లు బిగించినట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.