నారద వర్తమాన సమాచారం
చౌక బియ్యం రీసైక్లింగ్ తక్షణమే ఆపాలి: సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి: రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర చర్చ జరిగింది.
రేషన్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు.
చౌక బియ్యం రీసైక్లింగ్ తక్షణమే ఆపాలని ఆదేశించారు.
వినియోగదారులు తినడంలేదని రీసైక్లింగ్ ఫర్వాలేదన్న ధోరణి సరికాదన్నారు.
రేషన్ బియ్యంపై పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు తీసుకుందామన్న చంద్రబాబు..
స్మగ్లింగ్ చేస్తున్న రకాలు ఉత్పత్తి దశలోనే ఆపేస్తే ఎలా ఉంటుందని అడిగారు.
రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా?: కలెక్టర్లను ప్రశ్నించిన పవన్
చెక్ పోస్టులు ఉన్నా అక్రమ రవాణా ఎలా జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కలెక్టర్లను ప్రశ్నించారు.
చౌక బియ్యంలో ఇతర బియ్యం కలిపి రవాణా చేశారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
13 కేసుల్లో 86 రైస్ మిల్లలుకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా?అని పవన్ ప్రశ్నించగా డైల్యూషన్ తక్కువగా ఉండటంతో పట్టుకోవడం కష్టంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
విశాఖ పోర్టులోనూ చౌకబియ్యం పట్టుకున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.
కాకినాడ పోర్టులో ఐదు సార్టెక్స్ మిల్లులు నడవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
అక్కడే మిల్లింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారన్నారు.
నిరంతరం తనిఖీల ద్వారా రేషన్‌బియ్యం స్మగ్లింగ్ ఆగిందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు తినే బియ్యాన్ని చౌకదుకాణాల ద్వారా ఇవ్వడం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
రీసైక్లింగ్ బియ్యాన్ని, ప్రభుత్వం, ఎఫ్‌సీఐ కొనాల్సి వస్తోందన్నారు.
ప్రజల తినే బియ్యం పండించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా సమావేశంలో అన్నారు.
చౌకబియ్యం స్మగ్లింగ్ అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని తెలిపారు.
చౌక బియ్యంపై ప్రజల అభిప్రాయం తీసుకుందామని మంత్రులు, అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








