నారద వర్తమానం సమాచారం
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజంద్రప్రసాద్ విజయం కు తేదేపా నేతలు కృషి చేయాలి – కొమ్మాలపాటి
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ
ఎన్డీయే కూటమి ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయంకు తేదేపా నేతలు గెలుపే ధ్యేయంగా కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు..
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుందనీ అన్నారు.. భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకులు కూటమి నాయకులుగా ఉండటం రాష్ట్ర యువత చేసుకొన్న అదృష్టం అని అన్నారు.
చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానం అద్భుతం అన్నారు..అలాంటి దూరదృష్టి గల నాయకులు ముఖ్యమంత్రి గా ఉండటం వలనే యువత భవిష్యత్ బాగుంటుందనీ అన్నారు.. దావోస్ వేదికగా రాష్ట్రానికి అనేక కంపెనీలను ఆహ్వానించిన ఘనత చంద్రబాబుది అని అన్నారు..
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుంది అని, తద్వారా యువత కి పెద్ద ఎత్తున ఉద్యోగ , ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి యువత కూటమి ప్రభుత్వం కు మద్దతు ప్రకటించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు…ప్రతి ఓటర్ కి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను వివరించాలనీ, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం చేపడుతున్న చర్యలను ఓటర్లకు వివారించాలనీ యువతకు పిలుపునిచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









