Friday, May 15, 2026
spot_img

పల్నాడు ప్రాంతానికి మంత్రి పదవి – న్యాయమైన హక్కు ,

నారద వర్తమాన సమాచారం

పల్నాడు ప్రాంతానికి మంత్రి పదవి – న్యాయమైన హక్కు,

పల్నాడు – తెలుగు చరిత్రలో గర్వపడే ఘట్టాలకు నెలవైన భూమి. పల్నాటి యుద్ధం (1176 AD) భారతీయ సామంత రాజ్యవ్యవస్థలో మహత్తరమైన సంఘటన. కానీ, దురదృష్టవశాత్తూ, రాజకీయంగా, అభివృద్ధిలో పల్నాడు ప్రాంతం తీవ్రంగా వెనుకబడిపోయింది.

గత 70 ఏళ్లుగా పల్నాడు ప్రాంతానికి అసెంబ్లీలో గొంతుక ఉన్నా, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ పరిస్థితిని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా పాలకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని NDA ప్రభుత్వం, ఈ అన్యాయాన్ని సరిచేసే బాధ్యత తీసుకోవాలి.

చరిత్ర చెపుతున్న విషయాలు – పల్నాడు అస్తిత్వ పోరాటం

పల్నాడు అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఇది సాహసం, సత్యం, సమానత్వం కోసం పోరాడిన యోధుల నేల.

చాపకూటి సిద్ధాంతాన్ని అందరూ సమానమే అని ముందుకెళ్లిన నేల పలనాడు నేల

ఆనాటి రోజుల్లోనే పలనాటి రాజ్యాం గా పిలవబడిన రోజులు నుంచి ఈరోజు రాజకీయ అస్థిరత ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది,

ఎప్పుడూ పల్నాడు ప్రాంతాన్ని రాజకీయంగా అణగదొక్కాలని అన్ని పార్టీలు చూస్తున్నాఈ ఏ పార్టీ అయినా పల్నాటి ప్రాంతాన్ని ఎందుకు అనకు దక్కుతున్నాయి రాజకీయపరంగా అదే రాజు మనవడు అయితే ఎంతో కొంత మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది??

గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఉన్న కోటలు, పురాతన శాసనాలు – ఈ ప్రాంతం వైభవాన్ని చూపిస్తున్నాయి.

గల్లేటి బ్రహ్మనాయుడు, నల్గమ రాజు, నాగమ్మ, కన్నెగంటి హనుమంతు, గుర్రం జాషువా పింగళి వెంకయ్య, మొదలగు వారు పల్నాడు ప్రాంత గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లారు

తెలుగులో ప్రజాస్వామ్య ప్రేరణ కలిగించిన ప్రాంతం ఇదే.

ఇంత గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం రాజకీయంగా ఎందుకు పక్కన పడిపోయింది?

పల్నాడు ముఖద్వారం” అనే పేరు చెప్పుకొని గత 70 ఏళ్లుగా నరసరావుపేట, చిలకలూరిపేట నేతలకే మంత్రి పదవి ఇస్తూ వచ్చారు.

నిజమైన పల్నాడు అయిన గురజాల, మాచర్ల నియోజకవర్గాలను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

రాజకీయ లబ్ధి కోసం పల్నాడు పేరు వాడుకుంటున్నారు కానీ, అసలు పల్నాడు ప్రజలకు మాత్రం పదవి ఇవ్వడంలేదు.

ఇది అసమానత, అన్యాయం. పల్నాడు ప్రజలు దీన్ని ఇకపై భరించలేరు!

పల్నాడు ప్రాంతం భౌగోళికంగా, వ్యవసాయ పరంగా వెనుకబడి ఉంది. పరిశ్రమలు లేవు, రోడ్లు కనీస స్థాయిలో కూడా లేవు, ఉపాధి అవకాశాలు లేవు???

కరువు ప్రాంతంగా మారిన ఈ నేలకు ఇప్పటికీ సరైన సాగునీటి ప్రణాళిక లేదు???

రైతులకు భరోసా లేక, యువతకు ఉద్యోగం లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు.

ఇది ఒక్కమాటలో చెప్పాలంటే – పాలకుల నిర్లక్ష్యం! ఒక బలమైన మంత్రి ఉంటేనే – ఈ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు తీసుకురావచ్చు

ఈసారి మంత్రి పదవి వస్తే – ఇకపై సంప్రదాయంగా నిలుస్తుంది!

ఈసారి పల్నాడు ప్రాంతానికి మంత్రి పదవి వస్తే, ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా అది కొనసాగించే అవకాశముంది.

పల్నాడు ప్రాంతంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యత, పురోగతి & సమస్యలు

పల్నాడు ప్రాంతం భౌగోళికంగా అధిక ఎత్తులో ఉన్న కారణంగా తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రమైనవి. ముఖ్యంగా, ఎత్తిపోతల (Lift Irrigation) పథకాలు ఈ ప్రాంతానికి జీవనాడిలా పనిచేయగలిగినవే. కానీ, అనేక ప్రాజెక్టులు ముసురుకున్న అనుమతుల సమస్యలు, నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతున్నాయి.

  1. వరికపుడిసెల వాగు ఎత్తిపోతల పథకం ( పల్నాడు ప్రాజెక్ట్)  ప్రాధాన్యత నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మాచర్ల, దాచేపల్లి, గురజాల ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్ట్.

ఇది పూర్తయితే 30,000 హెక్టార్లకు పైగా సాగు భూమికి నీరు అందించవచ్చు.

మాచర్ల నియోజకవర్గ రైతులకు ఇది ఎంతో అవసరం.

  1. పల్నాడు కరువు ఉపశమన ప్రాజెక్ట్ (PDMP)  ప్రాధాన్యత

గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదిత పథకం.

గుంటూరు జిల్లాలోని హరిశ్చంద్రపురం నుంచి నకరికల్లు వరకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్ట్.

వరుస కరువులతో ఇబ్బంది పడుతున్న పల్నాడు రైతులకు ఇది భరోసా.

  1. నూజెండ్ల మండలంలో 5 ఎత్తిపోతల పథకాలు  ప్రాధాన్యత

రూ.95 కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ప్రాజెక్టులు.

10,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే అవకాశం.

  1. బొల్లాపల్లి మండలంలో ఎత్తిపోతల పథకం ప్రాధాన్యత

25,000 ఎకరాలకు సాగునీరు అందించగలిగే ప్రాజెక్ట్.

వినుకొండ నియోజకవర్గ రైతులకు తాగునీటి సమస్య తగ్గించటం

  1. పేటసన్నిగండ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత

మాచర్ల నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుగా అభివృద్ధి చెందాల్సిన పథకం.

పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందించగలదు.

  1. వెల్లంటిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్  ప్రాధాన్యత

ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చు.

ఇది బలమైన వ్యవసాయ ఉపాధికి తోడ్పడేలా ఉంటుంది.

అనేక మార్లు ప్రాజెక్ట్‌పై హామీలు ఇచ్చినా, పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
ప్రభుత్వం స్పష్టమైన టైమ్‌ఫ్రేమ్ ఇచ్చి ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తి చేయాలి.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధుల కేటాయింపుపై ఒత్తిడి తేవాలి.
రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కలిసి నిరసన కార్యక్రమాలు చేయాలి.

ప్రాజెక్ట్‌ల పూర్తి స్థాయి స్థితిగతులను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలి.

ఇప్పటికీ “
రాయలసీమ ప్రాంతం వాళ్లు ముఖ్యమంత్రిగా

ఉత్తరాంధ్రకు డిప్యూటీ సీఎం” అనే సంప్రదాయం ఉంది

(((మరి పల్నాడు ప్రాంతం వాళ్లు ఎక్కడ))????

అలాగే “పల్నాడుకు తప్పకుండా మంత్రి పదవి” అనే సంప్రదాయాన్ని ఏర్పరచాలి.
ఇది సంచలన నిర్ణయం అవుతుంది – పాలకుల వైఖరి మారుతుంది – ప్రజలకు న్యాయం జరుగుతుంది.

రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా నిలబడాలి!
ఇది ఏ పార్టీకి చెందిన వారి సమస్య కాదు. ఇది మన ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం. అందరూ కలిసొచ్చి, రాజకీయం పక్కనపెట్టి, మన హక్కు కోసం నిలబడాలి!

పల్నాడు హక్కు – మంత్రి పదవి మనదే

( పై తెలుపబడిన సమాచారం అంతా కూడా నా సొంత అభిప్రాయంగా పరిగణించవలసిందిగా కోరుతున్నాను )

ఇట్లు.
మీ..అంబటి. నవ కుమార్, మాజీ.ఎంపీపీ..,

పల్నాడుకిమంత్రిపదవి పల్నాడున్యాయం గురజాలఅభివృద్ధి పల్నాటిపోరాటం


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading