నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాం మంజూరు అయినందున స్థల సేకరణ చేసి త్యరితగతిన స్థలాన్ని అందించాలని అధికారులు ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
పల్నాడు జిల్లాకు సంబంధించి రొంపిచర్ల ,మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరు అయినందున అవసరమైన స్థలాన్ని త్వరితగతిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సంబంధిత అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో రెవిన్యూ అధికారులు మరియు కేంద్రీయ విద్యాలయ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్లలో అనువైన ప్రదేశాన్ని గుర్తించి తక్షణమే తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారికి సూచించారు. ఈ సందర్భంగా మాచర్ల రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాచర్ల లోని పిడబ్ల్యుడి కాలనీ, మరియు జిల్లా పరిషత్ బాయ్స్ పాఠశాలలో రూములు కేటాయించదానికి అనువుగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా పిడబ్ల్యుడి కాలనీలో 5 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయ అధికారులతో క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రొంపిచర్లలో మంజూరైన కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని రీ వెరిఫై చేయాలనీ సంబంధిత మండల రెవెన్యూ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గురజాల రెవిన్యూ డివిజన్ అధికారిమురళీ కృష్ణ, నరసరావుపేట రెవిన్యూ డివిజనల్ అధికారి మధులత, రొంపిచర్ల మండల రెవెన్యూ అధికారి నిర్మల ,కేంద్రీయ విద్యా లయాల డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








