Friday, January 16, 2026

కలవరపెడుతున్న బాబా వంగా జోస్యం.. ఏలియన్స్ రాక, ప్రపంచ యుద్ధం తప్పదా?

నారద  వర్తమాన సమాచారం

కలవరపెడుతున్న బాబా వంగా జోస్యం.. ఏలియన్స్ రాక, ప్రపంచ యుద్ధం తప్పదా?

2026లో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందన్న బాబా వంగా

మానవాళికి తొలిసారిగా గ్రహాంతరవాసులతో పరిచయం అవుతుందని జోస్యం

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ ఈ జోస్యంపై తీవ్ర చర్చ
ఈ ఏడాదే పెద్ద యుద్ధం, రాజకీయ కుట్రలు ఉంటాయన్న నోస్ట్రడామస్

‘బాల్కన్ల నోస్ట్రడామస్‌’గా పేరొందిన బల్గేరియాకు చెందిన బాబా వంగా జోస్యాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఎన్నో ఘటనలను ఆమె ముందే ఊహించారని నమ్ముతారు. 1996లోనే ఆమె మరణించినప్పటికీ, ఆమె చెప్పిన భవిష్యవాణిపై ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, మానవాళికి తొలిసారిగా గ్రహాంతరవాసులతో పరిచయం ఏర్పడుతుందని ఆమె జోస్యం చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.

గ్రహాంతర జీవులతో మానవాళికి పరిచయం ఏర్పడుతుందని, ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభానికి లేదా వినాశనానికి దారితీయవచ్చని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. గత నెల భూమికి దగ్గరగా వచ్చిన ‘3I/ATLAS’ అనే ఓ రహస్య వస్తువును దీనికి సంకేతంగా కొందరు సిద్ధాంతకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధంపై బాబా వంగా చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు బాబా వంగా జోస్యంతో పాటే 1500ల కాలానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అంచనాల ప్రకారం ఈ ఏడాది ఒక ప్రముఖ వ్యక్తి హత్యకు గురయ్యే అవకాశం ఉందని, లేదా ఒక రాజకీయ పాలనను కూల్చే కుట్ర జరగవచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది ఏడు నెలల పాటు సాగే ఓ పెద్ద యుద్ధం గురించి కూడా ఆయన తన రచనల్లో హెచ్చరించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading