నారద వర్తమాన సమాచారం
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో కొనసాగుతోన్న “ఫేస్ వాష్ అండ్ గో “
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు..
రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా పల్నాడు జిల్లా లోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధులలో “ఫేస్ వాష్ అండ్ గో ” కార్యక్రమం చేపట్టారు..
పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారుల పై “బ్లాక్ స్పాట్స్” గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోలీసు అధికారులు తమ సిబ్బందితో అర్ధరాత్రి దాటాక ద్విచక్ర వాహన దారులకు, లారీలు,బస్సులు, వ్యాన్లు,కార్లు,తదితర వాహనాల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.
లారీలు, కార్లు, వ్యాన్లు, బస్సులు, తదితర వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు పోలీసు అధికారులు సూచించారు.
ఈ ఫేస్ వాష్ & గో కార్యక్రమం ముఖ్య జాతీయ రహదారులు అయిన దాచేపల్లి తంగెడ అడ్డరోడ్డు,
ముప్పాళ్ళ,నరసరావు పేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్,శావల్యపురం పోలీసు స్టేషన్ పరిధులలో నిర్వహించడం జరిగింది.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి రోజు ఫేస్ వాష్ అండ్ గో,వాహనాల తనిఖీలు,విజిబుల్ పోలింగ్ కార్యక్రమములు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పల్నాడు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







