నారద వర్తమాన సమాచారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విక్టరీ పార్టీ అధ్యక్షులు విజయ్ కి అభినందనలు తెలియజేసిన మాజీ సీఎమ్ స్టాలిన్…..
మీరు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు సంతకం చేసిన ప్రకటనలను నేను కూడా స్వాగతిస్తున్నాను.
ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని వెంటనే అనడం మొదలుపెట్టకండి.
దాని దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు కావలసిందల్లా పరిపాలించాలనే సంకల్పం, సామర్థ్యం మాత్రమే.
ఐదేళ్లుగా, కోవిడ్, వరదలు, బీజేపీ ప్రభుత్వ మోసం వంటి ఎన్నో సమస్యలను అధిగమించి, మేము లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాము.
మీరు మీ మొదటి ప్రసంగంలోనే ‘గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి, ఖజానాను ఖాళీ చేసింది’ అని ఆరోపణ చేశారు..
తమిళనాడు అప్పు అనుమతించదగిన పరిమితిలోనే ఉంది.
గత ఫిబ్రవరి బడ్జెట్‌లో మేము తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేశాము. ఆ విషయం మీకు తెలియదా? ఆ తర్వాత ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా? మీకు ఓటు వేసిన ప్రజలను మళ్లీ మోసం చేసి తప్పుదోవ పట్టించకండి!
“ఆచరణాత్మకంగా సాధ్యమయ్యే వాగ్దానాలను మాత్రమే చేస్తాను” అని చెబుతూ మీరు అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పరిపాలనలోకి అడుగుపెడుతున్నారు. మాలాగే మీరు కూడా, ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలనే దానిలోని మెళకువలను త్వరలోనే నేర్చుకుంటారని నాకు నమ్మకం ఉంది.
మీకు ఓటు వేసిన ప్రజలతో పాటు నేను కూడా అదే ఆశిస్తున్నాను.
మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రస్థానం కొనసాగాలని మరోసారి శుభాకాంక్షలు తెలియజేసిన స్టాలిన్ !
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








