నారద వర్తమాన సమాచారం
గుంతకల్లు టు గుంటూరు ట్రాక్.. గాజులపల్లి టన్నెల్ పూర్తి
రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది.
గాజులపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
రవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








