నారద వర్తమాన సమాచారం
రూ.70,000 కోట్ల పన్నులు ఎగ్గొట్టిన రెస్టారెంట్లు.. హైదరాబాద్‌లో బయటపడ్డ స్కాం
హైదరాబాద్ రెస్టారెంట్ల నుంచి మొదలైన తనిఖీ.. జాతీయ స్థాయి వరకు వెళ్లింది. రెస్టారెంట్లు తమ బిల్లింగ్ కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నారు. అయితే, దీనిలోని లోపాల్ని ఆధారం చేసుకుని, సాఫ్ట్‌వేర్ దుర్వినియోగం చేస్తూ బిల్లుల్ని తక్కువగా చూపుతున్నారు.
యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటి వాటి ద్వారా చేసే చెల్లింపుల్ని మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. కానీ, క్యాష్ ద్వారా జరిగే బిల్లుల్ని డిలీట్ చేస్తున్నారు. దీంతో ఆ రెస్టారెంట్లలో తక్కువ వ్యాపారం జరిగినట్లు చూపించి, ప్రభుత్వానికి పన్నులు కూడా తక్కువగానే కడుతున్నారు. కొన్నిసార్లు అసలు బిల్లులే రాలేదని కూడా చూపుతున్నారు.
దేశంలోని 1.77 లక్షల రెస్టారెంట్లకు సంబంధించిన బిల్లుల సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించి అధికారులు ఈ విషయం చెబుతున్నారు. దొంగ బిల్లులకు కారణమైన సాఫ్ట్‌వేర్‌ను 10 శాతం కంపెనీలు వాడుతున్నాయి. వీటికి సంబంధించి 60 టీబీ డాటాను అధునాతన టెక్నాలజీ, ఏఐ ద్వారా పరిశీలించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








