.
నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా దాచేపల్లి అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ కృత్తిక శుక్ల ఐ ఏ ఎస్
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో పారిశ్రామిక ప్రగతి మరియు పర్యాటక రంగాన్ని బలోపేత చేసేందుకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీరామపురం మరియు పొందుగల గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, కృష్ణా నది పరివాహక ప్రాంతాలను ఆమె పరిశీలించారు.
శ్రీరామపురంలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు
పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా శ్రీరామపురం గ్రామంలో ఇథనాల్ ప్లాంటు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా జిల్లాలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడమే కాకుండా, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.
పర్యాటక కేంద్రంగా పొందుగల – బోటింగ్ సదుపాయం
అనంతరం పొందుగల గ్రామంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేకు ఆనుకుని ఉన్న గత పుష్కరాల ఘాట్లను పరిశీలించారు. పొందుగల ఘాట్ల వద్ద పర్యాటకుల కోసం త్వరలోనే బోటింగ్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పొందుగలను ఒక పర్యాటక సర్క్యూట్‌గా మార్చడం ద్వారా స్థానిక యువతకు జీవనోపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ వెల్లడించారు.
నదీ తీరంలోని ఘాట్లను నిరంతరం శుభ్రంగా ఉంచాలని స్థానిక అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్‌డిఓ మురళీకృష్ణ, పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, స్థానిక తహసీల్దార్, ఎంపిడిఓ, పొందుగల గ్రామ కార్యదర్శి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









