నారద వర్తమాన సమాచారం
ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించిన శ్రీ సాయి వృద్ధాశ్రమ సేవా సమితి
పిడుగురాళ్ల:
పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ సాయివృద్ధాశ్రమ సేవ సమితి వారు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక ధూళిపాళ్ల ఎల్.వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది నేత్ర వైద్యుల బృందం సుమారు 110మంది వృద్ధులకు అనాధలకు పిల్లలకు కంటి శుక్లాలు పొరలు నీటికాసులు మొదలైన వాటికి వైద్యం నిర్వహించి కంటి సమస్యలు ఉన్న రోగులకు ఉచిత మందులు మరియు కళ్లజోడులు పంపిణీ చేశారు.
అలాగే, ముత్యబిందు (Cataract) సమస్యతో బాధపడుతున్న కొంతమంది రోగులను శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసి, వారికి సమీపలో వున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ఉచిత ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ శిబిరం ద్వారా ప్రజలు కంటి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వృద్ధాశ్రమం సేవా సమితి ఆర్గనైజర్ ఎ. ఎల్.నరసింహమూర్తి మరియు ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సూపర్వైజర్ ప్రేమ్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ బాబు, విజన్ టెక్నీషియన్ గౌసియా, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








