ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బీసీ ముస్లిం మైనార్టీ కేసులలోని బాధితులకు న్యాయం చేయాలని డి.ఎస్.పి కి వినతి పత్రాన్ని అందించిన గురజాల అప్పారావు…..
నారద వర్తమాన సమాచారం
గురజాల సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పరిధిలోని వివిధ స్టేషనులలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బీసీ ముస్లిం మైనార్టీ కేసుల విషయంలో వేగవంతమైన విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టనీ గురజాల డి.ఎస్.పి మల్ల మహేశ్వరావుకు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఏప్రియల్ 12 న గురజాల నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయనను అప్పారావు
ప్రజా సంఘాల నాయకులతో కలిసి
శుక్రవారం గురుజాలలోని
సబ్-డివిజనల్ డీఎస్పీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలవాలుతో ఘనంగా సత్కరించి ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు
వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా
అప్పారావు మాట్లాడుతూ గురజాల నూతన డీఎస్పీగా మల్ల మహేశ్వరరావు బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు.
గురజాల సబ్ డివిజనల్ డిఎస్పి కార్యాలయ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చే ఫిర్యాదుదారులకు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదు దారులకు రసీదు ఇచ్చే విధంగా చూడాలి,
ఎస్సీ ఎస్టీల బీసీలు ముస్లిం మైనార్టీపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసే విధంగా చూడాలని,ఎస్సీ ఎస్టీ కేసుల ఫిర్యాదుల పట్ల పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అది జరగకుండా చూడాలని, ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు భరోసా కల్పించి వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించే విధంగా సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు నివసించే ప్రాంతంలో యువత చెడు వ్యసనాలకు లోనవుతున్నారని, వారు అసాంఘిక కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారనిఅందుచేత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటువంటి ప్రాంతంలో చట్టాల పట్ల అవగాహన కలిగే విధంగా యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వం ప్రతినెల చివరి వారంలో గ్రామాలలో నిర్వహించే పౌరహక్కుల దినోత్సవం
ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ వారు హాజరయ్యే విధంగా చూడాలని సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు.డి.ఎస్.పి మహేశ్వరరావు సమస్యలపై సానుకూలంగా స్పందించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
డీఎస్పీకి అభినందనలు తెలియజేసిన వారిలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు,ఏపీ హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, ప్రొటెక్షన్ కమిషన్ ఏపీ రాష్ట్ర ఇంచార్జ్ సైకం కృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటర్ మెంబర్ దళిత బహుజన సేవా సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్క ముడీ ప్రసాద్ .అడ్వకేట్ కొమ్ము నాగేంద్రబాబు, దళిత నాయకులు
జి.కాశయ్య, సిద్దెల బాబురావు,జిమ్,
పవర్ లిఫ్టింగ్ కోచ్
కత్తి జ్యోతి బాబు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








