నారద వర్తమాన సమాచారం
డ్రగ్స్ మరియు గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా….
ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మాదకద్రవ్యాలు మరియు గంజాయి నియంత్రణ చర్యలు – అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ కృష్ణారావు తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి హాట్‌స్పాట్‌ల ధృవీకరణ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌లను పోలీసులు పూర్తిగా తనిఖీ చేసి, పర్యవేక్షించాలి అని అన్నారు
అనుమానిత వ్యక్తుల దర్యాప్తు మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలి. టిడ్కో హౌసెస్ లో కర్దోన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయాలని అన్నారు.
కమర్షియల్ క్వాంటిటీ కేసులు: ఎక్కువ మొత్తం గంజాయి సరఫరా చేస్తూ లేదా అమ్ముతూ దొరికిన వారిపై చట్ట పరంగా వారి ఆస్తులు జప్తు చేయుటకు చర్యలు.
ఎన్‌డీపీఎస్ కేసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన కొనసాగుతున్న మరియు కొత్త కేసులపై చర్చ. మాదక ద్రవ్యాల వినియోగదారుల గుర్తింపు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించే వ్యక్తులను గుర్తించి, ట్రాక్ చేయడానికి వ్యూహాలు.
డీ-అడిక్షన్ సెంటర్ల పాత్ర ఏరియా హాస్పిటల్ నందు ఉన్న డీ-అడిక్షన్ సెంటర్ కొత్తగా ఏర్పాటైన డీ-అడిక్షన్దే సెంటర్లో స్టాఫ్ కొరతను తగ్గించుటకు నోటిఫికేషన్ ఇచుట మరియు డీ-అడిక్షన్ సెంటర్ ను విసిత్ చేయుట.
విద్యాసంస్థలకు 500 మీటర్స్ దూరంలో పొగాకు మరియు డ్రగ్స్కు సంబంధించిన పదార్ధాలు అమ్ముతాను నిషేధించాలని తెలియపరిచినారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి సూచనలు ఎన్.ఆర్.ఎక్స్ డ్రగ్స్ మరియు సింథటిక్ డ్రగ్స్ను నిర్మూలించుటకు అవసరమైన పీరియాడిక్ మరియు అత్యవసర చెక్స్ చేయుట. ఆపరేషన్ గరుడను పునఃప్రారంభం చేయాలని తెలిపారు.నషా ముక్త్ భారత అభియాన్ కార్యక్రమం లో భాగంగా ఉన్న నిధులను సత్వరమే ఒక ప్రణాళికను రచించి ప్రణాళిక బద్ధంగా గంజాయి నిర్మూలించుటకు ఉపయోగించాలని తెలిపారు.
డి అడిక్షన్ సెంటర్ కు కావలసిన స్థాఫ్ ను విధులలోకి తీసుకోవాలని తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారి మరియు సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ గారు కలిసి NGOs సహాయంతో స్కూల్స్ మరియు కాలేజీలలో అవేర్నెస్ కాంపస్ ఏర్పాటు చేయాలనీ తెలిపారు.
ఇంటర్-డిపార్ట్‌మెంటల్ సహకారం: మాదక ద్రవ్య దుర్వినియోగ నిర్మూలన లో బాధ్యతాయుతమైన అన్ని శాఖలు మరియు స్టేక్ హోల్డర్లు సమన్వయం తో చురుకుగా పాల్గొనాలి.
మాదక ద్రవ్యాల పై అవగాహన ఇంటర్- డిపార్ట్‌మెంటల్ సహకారంతో వీలైనన్ని ఎక్కువ అవగాహన కార్యక్రమాల ద్వార విద్యార్దులు మరియు ప్రజలలో మాదక ద్రవ్యాల వాళ్ళ కలిగే నష్టాలపై చైతన్యం కలిగించడం చేయాలని అన్నారు.
నశా ముక్త్ భారత్ కార్యక్రమాలను చేపట్టాలని, ప్రతి హాస్టల్ లలో డ్రగ్స్ మరియు గంజాయిపై అవగహన కల్పించాలని, పోస్టర్ లను ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలల్లో నోడల్ అధికారిని నియమించాలని, ప్రతి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు ఏదైనా డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉన్నచో పోలీస్ శాఖకు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. డ్రగ్ డిపార్ట్మెంట్‌కు సంబంధించి, NRx డ్రగ్స్ అక్రమ విక్రయాలను పూర్తిగా నియంత్రించేందుకు, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా NRx మెడిసిన్స్ ఆర్డర్ చేసి విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ప్రత్యేక దృష్టి పెట్టి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలన్నారు. గ్రామాల్లో గంజాయి సాగుపై కింది స్థాయి అధికారులకు, ఫారెస్ట్ బీట్ అధికారులకు, ఈగల్ అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972పై అవగాహన మరింత పెంచాలన్నారు.
ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








