నారద వర్తమాన సమాచారం
ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి.
తెలంగాణలో ఆరుగురు సీనియర్
ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు దక్కాయి. వీరంతా 1995, 1996 బ్యాచ్ లకు చెందిన ఐపీఎస్ అధికారులు.., ప్రమోషన్ లు పొందిన అధికారుల్లో వీవీ శ్రీనివాస్ రావు (1995బ్యాచ్), స్వాతిలక్రా (1995 బ్యాచ్), మహేశ్ భగవత్ (1995 బ్యాచ్), చారుసిన్హా (1996 బ్యాచ్) డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్), వీసీ సజ్జనార్ (1996 బ్యాచ్) ఉన్నారు.
వీరంతా అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం (ఏప్రిల్ 22) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం మహేశ్ భగవత్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్నారు. స్వాతిలక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఇన్నాళ్లు కొనసాగుతున్నారు. వీవీ శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి చైర్మన్ గా ఉన్నారు. చారుసిన్హా సీఐ మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉన్నారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








