Sunday, May 10, 2026
spot_img

ఉచిత విద్యుత్ ఫైల్ పై ముఖ్యమంత్రి విజయ్ తొలి సంతకం

నారద వర్తమాన సమాచారం

ఉచిత విద్యుత్ ఫైల్ పై ముఖ్యమంత్రి విజయ్ తొలి సంతకం


తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జోసెఫ్ విజయ్, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించే ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. అలాగే మహిళా భద్రత కోసం ప్రత్యేక టీం ఏర్పాటు పాటు.. డ్రగ్స్ నియంత్రణ ఫైల్ పై కూడా ఆయన సంతకాలు చేశారు.

ఇకపై తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంద నుంది. ఈ సందర్భం గా మాట్లాడిన సీఎం విజయ్,సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చాలా కష్టాలు అనుభవించానని.. ఆకలి బాధలంటే ఏంటో తనకు తెలుసని విజయ్ అన్నారు. నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడినేనని.. సినిమాల్లో తనను ఉన్నతస్థాయిలో నిలిపారని విజయ్ అన్నారు.

తమ్ముడూ రా అంటూ పిలిచారు.కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ చెప్పుకొచ్చారు. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని..తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే అం డగా ఉన్నారన్నారు. రాత్రికి రాత్రే ఏ అద్భు తాలూ చేయడానికి తానేమి దేవదూతని కాదని.. తాను అందరిలా సాధారణ మనిషినేనన్నారు.

ఏది సాధ్యపడుతుందో అదే చెప్తాను, చేస్తా నని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభు త్వం రూ.10లక్షల కోట్ల అప్పులో ఉం దని.. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందన్నారు. ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ స్పష్టం చేశారు. ఇది మీ ప్రభుత్వం అన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading