Tuesday, June 9, 2026
spot_img

పిడుగురాళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ నిర్వహించిన జాబు మేళ లో యువతకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్. ఎం వెంకట నరసయ్య

నారద వర్తమాన సమాచారం

పిడుగురాళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ నిర్వహించిన జాబు మేళ లో యువతకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్. ఎం వెంకట నరసయ్య


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద(APSSDC) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఈ. తమ్మాజి రావు  తెలియపరిచారు, ఈ రోజు అనగా 09-06-2026 న గవర్నమెంట్ జూనియర్ కళాశాల, పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వింహించడం జరిగింది. ఈ జాబ్ డ్రైవ్ కు 12 కంపెనీలు హాజరు కాగా 138 మంది హాజరుఅయ్యారు అందులో 52 మంది ఉద్యోగాలకు ఏంపిక అయ్యారని తెలియజేసినారు.

ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిధి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ యం.వెంకట నరసయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఈ జాబ్ మేళ ను పిడుగురాళ్ళలో నిర్వహించడం చాలా సంతోషకరం అని తెలియజేశారు మరియు నియామక పత్రలు అందుకున్న యువతకు అభినందలు తెలుపుతు మరియు వారిని మరెన్ని ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలియచెసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది ఉద్యోగ కల్పనా అధికారి యం. రవీంద్ర నాయక్, సిఆర్ఓ కిరణ్ నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ పి. శ్రీకాంత్, రమ్య మస్తాన్, మరియు కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading