నారద వర్తమాన సమాచారం
ఏపీ శాసనసభ లో డీఎస్సీపై గందరగోళం……
ఏపీ శాసనమండలిలో మెగా డీఎస్సీపై గందరగోళం నెలకొంది. డీఎస్సీపై చర్చ చేపట్టాలని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇది ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతల నినాదాలపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను వెంటనే ఆర్డర్‌లోకి తీసుకురావాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. దీంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ్యుల నిరసనలతో చర్చకు అంతరాయం ఏర్పడింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








