నారద వర్తమాన సమాచారం
భోగాపురంలో విమాన సర్వీసులు ప్రారంభం
భోగాపురం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి ఇండిగో 6E6408 విమానం తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్‌గా భోగాపురం చేరుకుంది. ప్రయాణికులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. విశాఖపట్నం నుంచి భోగాపురానికి ప్రతి 30 నిమిషాలకు ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. పాత గాజువాక నుంచి ఉదయం 4.55 గంటలకు తొలి సర్వీస్ ప్రారంభమవుతుంది. సాధారణ ప్రయాణికులకు కూడా ఈ సర్వీసులకు అనుమతి కల్పించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








