నారద వర్తమాన సమాచారం
విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్ లో నమోదు చేయాలి-పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఐ పీ యస్
పల్నాడు జిల్లా లోని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, హోమ్‌స్టేలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు విదేశీయులకు వసతి కల్పించే ఇతర సంస్థల నిర్వాహకులు, తమ వద్ద బస చేసే ప్రతి విదేశీయుడి రాక, బస మరియు బయలుదేరే వివరాలను నిర్దేశిత విధానంలో తప్పనిసరిగా నమోదు చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఐ.పి.ఎస్.సూచించారు. ఈ నిబంధనలు విదేశీ పౌరులతో పాటు OCI (Overseas Citizenship of India) Card Holders, నేపాల్ మరియు భూటాన్ దేశాల పౌరులకు కూడా వర్తిస్తాయి.
24 గంటల్లో వివరాల నమోదు
Immigration and Foreigners Act, 2025 లోని Section 8 ప్రకారం, విదేశీయులకు వసతి కల్పించే Accommodation Keeper విదేశీయుల వివరాలను నిర్దేశిత విధానంలో సంబంధిత Registration Officer కు సమర్పించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు.
అదేవిధంగా, Immigration and Foreigners Rules, 2025 లోని Rule 17(5) ప్రకారం, విదేశీయుడు వసతి ప్రదేశానికి చేరుకున్న 24 గంటలలోపు Form III లోని వివరాలను ఎలక్ట్రానిక్ విధానంలో సంబంధిత Registration Officer కు సమర్పించాలి.
విదేశీయుడు వసతి ప్రదేశం నుండి బయలుదేరిన వివరాలను కూడా నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలి. OCI (Overseas Citizenship of India) కార్డు దారులు, నేపాల్ మరియు భూటాన్ పౌరులకు కూడా వర్తింపు.
విదేశీయుల వివరాలను క్రింది నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేయాలి:
Form III Portal: https://indianfrro.gov.in/formIII
విదేశీయుల రాక, బస మరియు బయలుదేరే వివరాలకు సంబంధించిన రికార్డులను సంబంధిత వసతి నిర్వాహకులు కనీసం ఒక సంవత్సరం పాటు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచాలి. సంబంధిత Registration Officer, District Magistrate లేదా Head Constable కంటే తక్కువ కాని హోదా కలిగిన పోలీస్ అధికారి కోరినప్పుడు, ఈ రికార్డులను తనిఖీ కోసం అందుబాటులో ఉంచాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
విదేశీయుల రాక మరియు బయలుదేరే వివరాలను నిర్దేశిత గడువులోగా డిజిటల్ విధానంలో నమోదు చేయకపోవడం Immigration and Foreigners Act, 2025 లోని సంబంధిత నిబంధనలకు విరుద్ధంగా పరిగణించబడుతుంది.
ఇలాంటి నిబంధనలను పాటించని వ్యక్తిగత లేదా వాణిజ్య Accommodation Providers / Accommodation Keepers పై ఒక్కో ఉల్లంఘనకు కనీసం Rs.50,000/- జరిమానా విధించబడే అవకాశం ఉంది. అలాగే, విద్యాసంస్థలు మరియు వైద్య సంస్థలకు ఒక్కో ఉల్లంఘనకు కనీసం Rs.1,00,000/- జరిమానా విధించబడే అవకాశం ఉంది. దీనికి అదనంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వసతి నిర్వాహకులకు సూచన
కావున పల్నాడు జిల్లాలోని అన్ని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, హోమ్‌స్టేలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు విదేశీయులకు వసతి కల్పించే ఇతర సంస్థల నిర్వాహకులు తమ వద్ద బస చేసే విదేశీ పౌరులు, OCI (Overseas Citizenship of India) Card Holders, నేపాల్ మరియు భూటాన్ దేశాల పౌరుల రాక మరియు బయలుదేరే వివరాలను నిర్దేశిత Form III ఆన్‌లైన్ పోర్టల్‌లో 24 గంటల్లోగా డిజిటల్ విధానంలో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
అలాగే, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, అమలులో ఉన్న Immigration and Foreigners Act, 2025 మరియు Immigration and Foreigners Rules, 2025 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిన పక్షంలో చట్టప్రకారం జరిమానాతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, ఐ.పి.ఎస్. స్పష్టంగా తెలియపరిచారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








