Friday, November 22, 2024

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదలకు నిజమైన స్వాతంత్రం: :మండవ వెంకటేశ్వర్లు గౌడ్ :

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదలకు నిజమైన స్వాతంత్రం

సూర్య పేట జిల్లా హుజూర్నగర్ మండలం

నారదా వర్తమాన సమాచారం ప్రతినిధి:-

టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదలకు నిజమైన స్వాతంత్రం లభించిందని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి , హుజూర్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ద్వారానే సామాజిక న్యాయం లభించిందని ,ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనారిటీ వర్గాలను చట్టసభలలోకి పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీ , ఎన్టీఆర్ కి దక్కిందన్నారు. కొన్ని వర్గాల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అణగారిన వర్గాలకు సైతం అందేలా కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు సైతం పెద ప్రజల పక్షాన నిల్చాడని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు కొమ్మగని వెంకటేశ్వర్లు గౌడ్ , పట్టణ గౌరవాధ్యక్షులు తమ్మిశెట్టి రాములు, గరిడేపల్లి , మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు కీసరి నాగయ్య ,మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు బుక్యా బాలాజీ నాయక్, గరిడేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు గౌడ్ , టిఎన్టియుసి నాయకులు చల్లా రామకృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కాస్తల మహేష్ , తెలుగు యువత నాయకులు గునుగుంట్ల తరుణ్ గౌడ్, కీసరి సైదులు తదితరులు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading