పెంచిన కాన్వకేషన్ ఫీజును వెంటనే తగ్గించాలి
. ఎస్. ఎఫ్. ఐ నాయకుల డిమాండ్
నారద వర్తమాన సమాచారం,
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,29.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కాన్వర్జేషన్ ఫీజులు ఐదు రేట్లు పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ మార్చ్ 26 తేదీన తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ పాసైన విద్యార్థులు తీసుకునే కాన్సోల్డేటెడ్ మెమో, ఓ.డి, కాన్వకేషన్ మెమో లకు సంబంధించిన ఫీజులను 700 నుండి 3500 లు అనగా ఒకేసారి ఐదు రేట్లు ఫీజులు పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్వకేషన్ ఫీజుకు సంబంధించి ఇతర యూనివర్సిటీలైన ఓయూ, కాకతీయ, శాతవాహన కన్నా అధికంగా తెలంగాణ యూనివర్సిటీ యంత్రాంగం కాన్వకేషన్ సంబంధించిన ఫీజులను పెంచడం దారుణం అని అన్నారు. కాన్వకేషన్ ఫీజుల పేరిట విద్యార్థుల పైన భారాన్ని మోపడం సరికాదని వెంటనే ఇంచార్జ్ వైస్ ఛాన్స్ లర్ బుర్ర వెంకటేశం స్పందించి కాన్వకేషన్ ఫీజును తగ్గించాలని లేకపోతే ఎస్ .ఎఫ్ .ఐ గా భవిష్యత్తులో ఉద్యమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.