

ఆద్రప్రదేశ్
బూత్, యూనిట్, క్లస్టర్ ఇంచార్జులు ఎన్నికలకు సమాయత్తం కావాలి – కన్నా లక్ష్మీనారాయణ
బూత్ ,యూనిట్, క్లస్టర్ ఇంచార్జుల కు రాబోయే ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం
నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి:ప్రతినిధి
సత్తెనపల్లి నియోజకవర్గ బూత్, యూనిట్, క్లస్టర్ ఇంఛార్జిలకు స్థానిక ప్రజా వేదిక నందు నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటి, ఇంటి ప్రచారం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని పట్టణలోని వార్డులలో, గ్రామాల్లో అందరూ నాయకులు, కార్యకర్తలు కలిసి రాబోయే 46 రోజులు ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అందించే సంక్షేమ పథకాలు జనంలోకి బలంగా తీసుకువెళ్లాలి అని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జులు పాల్గొన్నారు.








