Tuesday, October 20, 2026
spot_img

విజయ దశమి(దసరా పండుగ) సందర్భంగా ఆయుధ పూజ , శ్రీ కనక దుర్గ అమ్మవారి పూజ నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి దంపతులు,.

నారద వర్తమాన సమాచారం

విజయ దశమి(దసరా పండుగ) సందర్భంగా ఆయుధ పూజ , శ్రీ కనక దుర్గ అమ్మవారి పూజ నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి దంపతులు,.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి విజయ దశమి శుభకాంక్షలు తెలిపిన  ఎస్పీ

చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు మరియు జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు అని తెలిపారు.

చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకే ఈ దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ఎస్పీ తెలిపారు. అమ్మవారి పూజ అనంతరం వాహనాలకు మరియు ఆయధాలకు పూజ నిర్వహించారు
ఈ కార్యక్రమములో ఎస్పీ తో పాటు, అడిసినల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading