
జీవన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
నారద వర్తమాన సమాచారం:నిజామాబాద్ జిల్లా ,
జక్రాన్ పల్లి:ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా తాటిపర్తి జీవన్ రెడ్డిని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ జక్రాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో యువకులే ముఖ్యపాత్ర పోషించాలని నా విజయానికి బాసటగా నిలవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్రాన్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరి వినోద్, జిల్లా మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షుడు కిరణ్ అనుపాల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కనుక సాగర్ పాల్గొన్నారు.








