
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి: ఎస్ ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లావుడీయ రాజు
నారద వర్తమాన సమాచారం భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఈ రోజు ఎస్ఎఫ్ఐ పోచంపల్లి మండల మహాసభ పరమేష్ అధ్యక్షతన పోచంపల్లి పట్టణంలోని నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లావుడియ రాజు మాట్లాడుతూ
చదువు అనేది అంగట్లో సరుకుగా మారిందని రాష్ట్రవ్యాప్తంగా 7200 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెంచిన మెస్ కాస్మోటిక్ ఛార్జ్ లను వెంటనే అమలు చేయాలని కోరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలను ఓడించాలిని అదేవిధంగా మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడగొట్టే విధంగా విద్యార్థులందరూ ఏకం కావలసిన పరిస్థితి ఉందని అన్నారు. బిజెపి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా కాషాయకరణ, విద్యను ధ్వంసం చేయడం జరిగిందని, అదేవిధంగా గత టిఆర్ఎస్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించిందని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని అన్నారు. విద్యారంగం అభివృద్ధి చెందే వారి పాలన విధానం కనబడుటలేదని అద్దె భవనంలో ఉన్న హాస్టల్ లను సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేసి నూతన గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. కావున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని లేని యెడల రాబోయే రోజుల్లో విద్యార్థులను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని పోరాటాలకు విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా విద్యార్థులకు సన్నగా చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు పరమేష్ సాయినాథ్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కమిటీ సభ్యులు మంచర్ల మధు, నాయకులు అజయ్, నందు, ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.