నారద వర్తమాన సమాచారం
సత్తెనపల్లి పట్టణం తాలూకా సెంటర్ నందు మరియు రఘురామ్ నగర్ కార్యాలయం నందు
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ
రాజ్యాంగ నిర్మాత, మహా మేధావి, దార్శనికుడు, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన జాతిరత్నం డా.బి.ఆర్. అంబేద్కర్ .
మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా, అంబవాడ గ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు.
కుల వివక్ష, అస్పృశ్యత, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు.
ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలన్నదే అంబేద్కర్ ఆశయం.
అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాల బాటలో తెలుగుదేశంపార్టీ: తెలుగుదేశం పార్టీ నిర్మాణంలోనే అంబేద్కర్ ఆశయాల సాధన ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు బి.ఆర్. అంబేద్కర్ తనకు ఆదర్శం అని చాటి చెప్పారు.
“సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్ళు” అనే ఎన్టీఆర్ ప్రభోదం అంబేద్కర్ స్ఫూర్తి నుండి వచ్చిందే. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే అంబేద్కర్ కి భారతరత్న అవార్డు ప్రకటించారు. పార్లమెంటు హాల్లో డా.అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం కోసం అంకితభావంతో కృషి చేస్తోంది. అన్నారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








